SPDCL Compensation | విద్యుత్​ షాక్​తో మరణిస్తే రూ.8 లక్షల పరిహారం.. ఎస్​పీడీసీఎల్​ కీలక నిర్ణయం

విద్యుత్​ షాక్​తో మరణించిన వ్యక్తులకు ఇచ్చే పరిహారాన్ని ఎస్​పీడీసీఎల్ పెంచింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SPDCL Compensation | విద్యుత్​ షాక్​తో మరణించిన వ్యక్తులకు ఇచ్చే పరిహారాన్ని టీజీ ఎస్​పీడీసీఎల్ పెంచింది. ఈ మేరకు సీఎండీ జితేష్​ వి పాటిల్ (Jitesh V Patil)​ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్​పీడీసీఎల్ పరిధిలో విద్యుత్​ శాఖ సిబ్బంది కాకుండా ఇతరులు ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్​తో చనిపోతే ఇచ్చే పరిహారాన్ని సంస్థ పెంచింది. ప్రస్తుతం రూ.5 లక్షల పరిహారం ఇస్తుండగా.. ఆ మొత్తాన్ని రూ.8 లక్షలకు పెంచింది. ఈ పెంపు 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది.

SPDCL Compensation | ఆ కుటుంబాలకు ఊరట

రాష్ట్రంలో ఏటా విద్యుత్​ షాక్​తో వందలాది మంది చనిపోతున్నారు. ఇళ్లలో విద్యుత్​ పనులు చేస్తుండగా, వైర్లు తెగిపోయి ప్రమాదాల బారీన పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ బోరు బావుల వద్ద రైతులు కరెంట్ షాక్​తో చనిపోతున్నారు. ఆ కుటుంబాలకు ఎస్​పీడీసీఎల్​ పరిహారం అందిస్తోంది. విచారణ అనంతరం అధికారులు సంబంధిత చెక్కు అందజేస్తున్నారు. గతంలో రూ.5 లక్షల పరిహారం అందించగా.. దానిని రూ.8 లక్షలకు పెంచడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించనుంది. ఇందులో రూ.7.2 లక్షలు ఫిక్స్​డ్​ డిపాజిట్ చేస్తారు. రూ.80 వేల నగదు చేతికి ఇస్తారు.

మనుషులతో పాటు జంతువులు చనిపోతే కూడా పరిహారం అందిస్తున్నారు. అయితే ఈ మొత్తంలో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం గేదెలు, ఆవులు, ఎడ్లు చనిపోతే రూ.40 వేలు, మేకలు, గొర్రెలు మృతి చెందితే రూ.7 వేల పరిహారం అందిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Sugarcane Cultivation | చెరుకు పంట సాగు విస్తీర్ణాన్ని పెంచాలి : సీఎస్​ సంజయ్​ జాజు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *