Overloaded Vehicles Seized | రవాణాశాఖ కొరడా.. ఓవర్ లోడ్ వాహనాల సీజ్

జిల్లాలో ఓవర్‌లోడ్‌తో చెలరేగిపోతున్న భారీ వాహనాలపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝళిపించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Overloaded Vehicles Seized | జిల్లాలో ఓవర్‌లోడ్‌తో చెలరేగిపోతున్న భారీ వాహనాలపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝళిపించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదేశాలు, జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ డీటీసీ దుర్గ ప్రమీల సూచనల మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

Overloaded Vehicles Seized | ఆకస్మిక తనిఖీలలో..

శనివారం రాత్రి వరకు చేపట్టిన ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి లోడ్‌తో తిరుగుతున్న మూడు భారీ వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు జిల్లా రవాణాధికారి టి.సంతోష్ కుమార్ వెల్లడించారు. ఓవర్‌లోడ్ వల్ల రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని, క్వారీ నిర్వాహకులు, లారీ యజమానులు, డ్రైవర్లు ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దని డీటీఓ హెచ్చరించారు. మరోసారి ఓవర్‌లోడ్‌తో పట్టుబడితే వాహనాలు సీజ్ చేయడమే కాకుండా భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రధాన రహదారులన్నింటిపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. కాగా ఆదివారం కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు మరొక రెండు వాహనాలు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. రాత్రి వరకు మరికొన్ని వాహనాలు సీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ఎంవీఐ శంకర్ నారాయణ, ఏఎంవీఐలు రఫీ, కృష్ణ తేజ, రవాణాశాఖ కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ganja Smuggling Network | దర్జాగా గంజాయి దందా.. రైల్వే మార్గమే అడ్డాగా తరలింపు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *