అక్షరటుడే,నిజామాబాద్ : Independence Day Celebrations | స్వాతంత్య్ర వేడుకలను అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ భుజంగరావు (Additional Collector Bhujanga Rao) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అన్ని శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Independence Day Celebrations | ఆయాశాఖల వారీగా..
పంద్రాగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఈ వేడుకకు సంబంధించి వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, పశు సంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, పౌర సరఫరాల, పంచాయతీరాజ్, ఆర్టీసీ తదితర శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు.
Independence Day Celebrations | విజయవంతం చేయాలి
అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలని అదనపు కలెక్టర్ అన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పంద్రాగస్టు వేడుకకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధిగా హాజరు కావాలని అన్నారు. ఎక్కడ కూడా జాతీయ పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రశంసా పత్రాల బహూకరణ కోసం శాఖల వారీగా ఉత్తమ ఉద్యోగుల పేర్లతో కూడిన ప్రతిపాదనలను నిర్ణీత గడువు లోపు పంపించాలని ఆదేశించారు. ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్,. డీఆర్డీవో సాయన్న, కలెక్టరేట్ ఏవో బాలరాజు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Operation Muskaan | బాల్యానికి చేయూత.. ‘ఆపరేషన్ ముస్కాన్’ విజయవంతం