Banswada Hospital Superintendent | బాన్సువాడ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Hospital Superintendent | బాన్సువాడ(Banswada) ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఆయనను బాన్సువాడ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు.

Banswada Hospital Superintendent | విజయ్​భాస్కర్​ను ఆర్మూర్​ ఆస్పత్రికి..

ఇప్పటివరకు బాన్సువాడ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన విజయ్ భాస్కర్‌ను ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి బదిలీ చేశారు. దీంతో ఆయన స్థానంలో ఎం శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని, వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయడంతో పాటు, రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, వైద్య సిబ్బంది పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌కు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది స్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి : Revanth Reddy | మోడీ, అమిత్ షాలు రాజీనామా చేయాలి: సీఎం రేవంత్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *