Power Cut Protest | సబ్ స్టేషన్​కు తాళం.. ఆపరేటర్ నిర్బంధం

పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో విద్యుత్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్​స్టేషన్​ ఆపరేటర్​ను నిర్బంధించి నిరసన తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Power Cut Protest | పాల్వంచ మండలం ఆరేపల్లి (Arepally) గ్రామంలో విద్యుత్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్​స్టేషన్​ ఆపరేటర్​ను నిర్బంధించి నిరసన తెలిపారు. కామారెడ్డిలో(Kamareddy) ఈ ఘటన కలకలం రేపింది.

Power Cut Protest | మూడు రోజులుగా పవర్​ కట్​

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా పవర్ కట్(Power Cut) అవుతుండటంతో సోమవారం విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్​ను లోపలే నిర్బంధించి తాళం వేశారు. ప్రస్తుతం వరి నాట్ల సీజన్ కావడంతో రైతులంతా నారుమడులు సిద్ధం చేసుకుని పొలాల్లోకి దిగుతున్నారు. కానీ రోజుకు కొన్ని గంటలు మాత్రమే కరెంట్​ ఇస్తుండటంతో బోరు మోటార్లు నడవడం లేదు. ఫలితంగా వేసిన నారు ఎండిపోతుందని, సాగు అంతా నష్టపోయే పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేకపోతే వరినాట్లు వేయడం కష్టమని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు.

అధికారులు స్పందించకపోవడంతో విసిగిపోయిన రైతులు నేరుగా సబ్ స్టేషన్​కు వెళ్లి ఆపరేటర్​ను అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేంతవరకు తాము కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. వెంటనే విద్యుత్ సరఫరాలో కోతలు ఆపి, వరినాట్ల సమయంలో 24 గంటల కరెంటు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ 

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *