అక్షరటుడే, కామారెడ్డి: Russia Visa Fraud |రష్యాలో(Russia) వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామంటూ యువకుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన ఓ మోసగాడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. సోమవారం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో (Kamareddy Police) డిఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు.
Russia Visa Fraud |నిజామాబాద్ జిల్లాకు చెందిన..
మాచారెడ్డి(machareddy) మండలం మైసమ్మ చెరువు తండాకు చెందిన బుక్యా నరేష్‌తో పాటు ఆయన స్నేహితులకు రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని(Cyber Crime) నమ్మబలికిన నిజామాబాద్ జిల్లాకు చెందిన గలేటి వెంకటయ్య అలియాస్ వెంకటేష్ అలియాస్ వెంకట్ నమ్మబలికాడు. వీసా ప్రాసెసింగ్ పేరుతో మొత్తం రూ.9,37,000 వారి వద్ద నుంచి వసూలు చేశాడు. అనంతరం వర్క్ పర్మిట్ వీసాలు ఇవ్వకుండా నకిలీ వీసాలు చేతిలో పెట్టి, బాధితుల పాస్‌పోర్టులను తిరిగి ఇవ్వకుండా మోసగించాడు. దీనిపై వచ్చిన ఫిర్యాదుతో మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విషయమై ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించి కేసును ఛేదించింది. ఆదివారం మాచారెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట వాహన తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన వెంకట్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.
Russia Visa Fraud |నిందితుడితో పాటు మరో ఇద్దరు..
అతనితో పాటు మరో ఇద్దరు సహ నిందితులు కూడా ఈ మోసంలో ఉన్నట్లు తేలింది. నిందితుడి స్వచ్ఛంద వాంగ్మూలం ఆధారంగా భుక్యా జితేందర్, గుగులోత్ సురేష్, మలోత్ నితిన్‌లకు చెందిన మూడు భారతీయ పాస్‌పోర్టులు, రూ.45 వేల నగదు, మొబైల్ ఫోన్‌తో పాటు మోసం చేసిన సొమ్ముతో కొన్న హీరో బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు. మరో బాధితుడు బుక్యా నరేష్ పాస్‌పోర్టు సహ నిందితుడి వద్ద ఉన్నట్లు వెంకట్ తెలిపాడు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందని, ప్రధాన నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు. ఈ సమావేశంలో కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, మాచారెడ్డి ఎస్సై అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్