November 2026 Festivals | నవంబర్ పండుగల క్యాలెండర్ వచ్చేసింది.. దీపావళి, కార్తీక పౌర్ణమి ఎప్పుడంటే!

దీపావళి కాంతులు, కార్తీక మాస దీపారాధనలతో ఇళ్లన్నీ వెలుగులతో నిండిపోయే అద్భుతమైన మాసం వచ్చేస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: November 2026 Festivals | దీపావళి కాంతులు, కార్తీక మాస దీపారాధనలతో ఇళ్లన్నీ వెలుగులతో నిండిపోయే అద్భుతమైన మాసం వచ్చేస్తోంది. ఏయే రోజు ఏ పండుగ వస్తోంది? పూజలకు, వ్రతాలకు సరైన తేదీలు ఏంటి? అని ఆరాటపడే భక్తుల కోసం 2026 నవంబర్ నెల పూర్తి పండుగల జాబితా వచ్చేసింది..

November 2026 Festivals | నవంబర్ మొదటి వారంలో..

హిందూ క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో వరుసగా పెద్ద పండుగలు రాబోతున్నాయి. నవంబర్ 5వ తేదీ గురువారం రమా ఏకాదశితో పండుగల సందడి ప్రారంభం కానుంది. ఆ తర్వాత నవంబర్ 6 శుక్రవారం ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి జరుపుకోనున్నారు. ఇక భక్తులు ఎంతగానో ఎదురుచూసే నరక చతుర్దశి, దీపావళి ( Diwali ) , కేదార గౌరీ వ్రతం నవంబర్ 8వ తేదీ ఆదివారం రానున్నాయి.

November 2026 Festivals | కార్తీక మాసం ప్రారంభం..

నవంబర్ 9 సోమవారం అమావాస్య కాగా, నవంబర్ 10 మంగళవారం నుంచి పవిత్రమైన కార్తీక మాసం  ప్రారంభం కాబోతోంది. అదే రోజు గోవర్ధన పూజ , ఆకాశ దీపారంభం నిర్వహిస్తారు. నవంబర్ 11 బుధవారం యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం.. నవంబర్ 13 శుక్రవారం నాగుల చవితి జరుపుకుంటారు. అలాగే నవంబర్ 15 ఆదివారం స్కంద షష్ఠి, నవంబర్ 20 శుక్రవారం ప్రభోధిని ఏకాదశి రానున్నాయి. నవంబర్ 21 శనివారం క్షీరాబ్ధి ద్వాదశి , తులసీ పూజలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. కార్తీక మాసంలో అత్యంత కీలకమైన కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం నవంబర్ 24వ తేదీ మంగళవారం నాడు రాబోతున్నాయి. చివరగా నవంబర్ 27 శుక్రవారం సంకష్టహర చతుర్థి జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ప్రాంతాలను బట్టి తిథి, సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని పండితులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  Poonch Explosives Seizure | కశ్మీర్​లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *