Ranbir Kapoor Watch | రణ్‌బీర్ కపూర్ చేతికున్న వాచ్.. ధర తెలిస్తే షాకే..!

భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అగ్ర కథానాయకులలో రణ్‌బీర్ కపూర్ ఒకరు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ranbir Kapoor Watch | భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అగ్ర కథానాయకులలో రణ్‌బీర్ కపూర్ ఒకరు. మాస్, క్లాస్ ఇలా ఎలాంటి విభిన్న పాత్రలనైనా లీనమై నటించే ఈ బాలీవుడ్ స్టార్, విలాసవంతమైన జీవనశైలికి కూడా ఎంతో పేరుగాంచారు. అత్యంత ఖరీదైన కార్లు, నివాసాలతో పాటు రూ. లక్షలు, కోట్లు విలువ చేసే అరుదైన వాచీల కలెక్షన్ ఆయన సొంతం. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘రామాయణం’ మూవీ ఈవెంట్‌లో ఆయన ధరించిన ఓ ప్రత్యేకమైన వాచ్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Ranbir Kapoor Watch | ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 వాచీలు ..

హైదరాబాద్ ఈవెంట్‌లో నీలిరంగు డ్రెస్‌లో మెరిసిన రణ్‌బీర్, దానికి సరిపోయేలా ఒక అరుదైన లగ్జరీ వాచ్‌ను ధరించారు. ఇది స్విస్ లగ్జరీ బ్రాండ్ ‘జాకబ్ & కో’ (Jacob & Co) కి చెందిన ‘ఎపిక్ x షేర్-ఎ-పంజాబ్ ఎడిషన్’ (Epic X Sher-e-Punjab Edition) వాచ్. సిక్కు సమాజం, పంజాబ్ సంస్కృతి , సంప్రదాయాల ప్రతిబింబంగా అత్యాధునిక మెకానికల్ టెక్నాలజీతో ఈ వాచ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 పీసులు మాత్రమే తయారు చేయగా, అందులో ఒకటి రణ్‌బీర్ కపూర్ వద్ద ఉండటం విశేషం. భారత మార్కెట్లో ఈ వాచ్ వెల సుమారు రూ. 35.88 లక్షలు.

Ranbir Kapoor Watch | ‘రామాయణం’ విడుదల..

మరోవైపు నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ మొదటి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా, సీతగా సాయి పల్లవి ( Sai Pallavi ), రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపిస్తారు. రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, లారా దత్తా, శోభన తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Ranbir Kapoor Watch | భారీ విజువల్ వండర్..

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ , డిఎన్‌ఇజి (DNEG) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. తొలి భాగం 2026 నవంబర్ 5న రానుండగా, రెండవ భాగాన్ని 2027 దీపావళి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Poonch Explosives Seizure | కశ్మీర్​లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *