Fake Rapido Drivers | మహిళలు, ర్యాపిడో బుక్ చేస్తున్నారా? జర జాగ్రత్త

హైదరాబాద్ నగరంలో నకిలీ (ఫేక్) రాపిడో డ్రైవర్ల గురించిన సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Fake Rapido Drivers | హైదరాబాద్  నగరంలో నకిలీ (ఫేక్) రాపిడో డ్రైవర్ల గురించిన సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాను చార్మినార్ వద్ద ఎదుర్కొన్న అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు ఈ విషయంలో తీవ్ర అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరిస్తున్నారు. గత రాత్రి చార్మినార్ ప్రాంతంలో సదరు ఇన్ఫ్లుయెన్సర్ ఆటో కోసం వేచి చూస్తుండగా, ఒక వ్యక్తి స్వయంగా వచ్చి “ర్యాపిడో కావాలా?” అని అడిగాడు. ఆ వ్యక్తి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె వెంటనే వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించారు.

Fake Rapido Drivers | ర్యాపిడో యాప్ కూడా లేదు..

పరిశీలించగా ఆ వ్యక్తి ఉపయోగిస్తున్న స్కూటీకి కనీసం నంబర్ ప్లేట్ కూడా లేదు. అతనికి ర్యాపిడో డ్రైవర్ యాప్ కూడా లేదు. ఇన్ఫ్లుయెన్సర్ గట్టిగా ప్రశ్నించిన తర్వాతే అతను యాప్ డౌన్‌లోడ్ చేసి OTP ఎంటర్ చేసేందుకు ప్రయత్నించాడు. చివరికి అతని బండి స్టార్ట్ కాకపోవడంతో, రకరకాల సాకులు చెబుతూ కవర్ చేయడానికి ప్రయత్నించాడు. అంతేకాదు, ఆ వ్యక్తి తన పేరు ‘ఇర్ఫాన్’ అని చెప్పినప్పటికీ, ఆ పేరు కూడా ఫేక్ అని తేలింది.

Fake Rapido Drivers | మహిళల భద్రతకు ప్రాధాన్యత..

ఈ వీడియో బాగా వైరల్ కాగా, దీనిని కేవలం మహిళల భద్రత పట్ల అవగాహన పెంచేందుకే పోస్ట్ చేశానని, దీనికి ఎలాంటి మతపరమైన రంగులు పులమవద్దని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేకించి రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు నేరుగా బైక్ లేదా కార్ రైడ్లను ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డ్రైవర్ ఐడీ (ID) ఉందో లేదో సరిచూసుకోవాలి. వారి ఫోన్‌లో యాప్ పనిచేస్తుందో లేదో చూడాలి. వాహనానికి సరైన నంబర్ ప్లేట్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. వాహనం, డ్రైవర్ వివరాలు పూర్తిగా జెన్యూన్ అని నమ్మకం కుదిరిన తర్వతే రైడ్ బుక్ చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి:  Vikarabad Bus Accident | లోయలో పడిన బస్సు.. ముగ్గురి మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *