అక్షరటుడే వెబ్‌డెస్క్: Hitech City Train Halt | దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లపై రద్దీని తగ్గించేందుకు , ఐటీ కారిడార్ ఉద్యోగులకు ప్రయాణం సులభం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
Hitech City Train Halt | తాత్కాలిక నిలుపుదల..
ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరగడంతో, ఐటీ కారిడార్ ప్రాంతంలో నివసించే ఉద్యోగులు, ప్రయాణికులకు రాకపోకలు సులువుగా ఉండాలని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో 10 కీలకమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలిక నిలుపుదల (హాల్ట్) కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
Hitech City Train Halt| ఏయే రైళ్లకు హాల్ట్ లభించింది?
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో 10 ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలిక నిలుపుదల (హాల్ట్) కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో సికింద్రాబాద్ (Hyderabad ) – రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్, రాజ్‌కోట్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – పోర్‌బందర్ , పోర్‌బందర్ – సికింద్రాబాద్ , తిరుపతి – సికింద్రాబాద్ , సికింద్రాబాద్ – తిరుపతి , హైదరాబాద్ – ముంబై , ముంబై – హైదరాబాద్ , పుణే – హైదరాబాద్ , అలాగే హైదరాబాద్ – పుణే ఎక్స్‌ప్రెస్. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులు, ప్రజలు ఇకపై ప్రధాన స్టేషన్ల వరకు వెళ్లే పనిలేకుండా ఇక్కడే రైళ్లు ఎక్కే వెసులుబాటు కలగనుంది.
Hitech City Train Halt| ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది?
ఈ ప్రత్యేక తాత్కాలిక హాల్ట్ సౌకర్యం నవంబర్ 1, 2026 నుండి జనవరి 31, 2027 వరకు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. పండుగలు, శీతాకాలంలో ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, స్థానిక ప్రజలు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: Vikarabad Bus Accident | లోయలో పడిన బస్సు.. ముగ్గురి మృతి