Hyderabad Metro Common Pass | మెట్రోలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం, మంత్రులు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్​, వివేక్​ వెంకటస్వామి, అజారుద్దీన్​ శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Metro Common Pass | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్​, వివేక్​ వెంకటస్వామి, అజారుద్దీన్​ శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మెట్రో, ఆర్టీసీ కామన్ మొబిలిటీ పాస్‌తో మెట్రోతో పాటు బస్సులో ప్రయాణించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొత్త పాస్‌ను ప్రోత్సహించడానికి, హైదరాబాద్ ప్రజలకు ప్రజా రవాణాను సులభతరం చేయడానికి ఈ పర్యటన చేపట్టామన్నారు. ప్రయాణికులు ఇకపై బస్సు, మెట్రో ప్రయాణాలకు వేర్వేరు టిక్కెట్లు కొనాల్సిన అవసరం లేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ.. ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్ తీసుకొచ్చామని చెప్పారు.

Hyderabad Metro Common Pass | పబ్లిక్​ ట్రాన్స్​పోర్టు బలోపేతం

హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పొన్నం ప్రభాకర్​ పేర్కొన్నారు. ప్రజలను వ్యక్తిగత వాహనాల నుంచి ప్రజా రవాణా వైపు ఆకర్షించాలంటే ఆర్టీసీ, మెట్రో సేవలను మరింత సమన్వయంతో, సౌకర్యవంతంగా అందించాలని తెలిపారు. నగర అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల ప్రయాణ కష్టాలను తగ్గించడంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రజల ప్రయాణ భారం తగ్గించాలనే ఉద్దేశంతో డైలీ పాస్, మంత్లీ పాస్‌తో పాటు కామన్ పాస్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Fake Rapido Drivers | మహిళలు, ర్యాపిడో బుక్ చేస్తున్నారా? జర జాగ్రత్త

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *