అక్షరటుడే వెబ్డెస్క్: Telangana Teacher Meals | తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో జరిగిన తొలి ‘ఈ-కేబినెట్’ సమావేశంలో, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు , జూనియర్ కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, , ఇతర నాన్-టీచింగ్ సిబ్బంది అందరికీ ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందించాలని మంత్రివర్గం తీర్మానించింది.

Telangana Teacher Meals | విధుల పట్ల మరింత నిబద్ధతతో ..
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉంది. అయితే, ఇకపై ఈ సదుపాయాన్ని సిబ్బందికి కూడా విస్తరించడం ద్వారా ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఎక్కువ సమయం గడపడానికి, అలాగే విధుల పట్ల మరింత నిబద్ధతతో అందుబాటులో ఉండటానికి వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నిర్ణయం వల్ల సిబ్బందికి ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్న విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు , విద్యా రంగ నిపుణులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court AI | న్యాయవ్యవస్థలో ఏఐ వాడకం.. నకిలీ తీర్పుల వినియోగంపై సుప్రీంకోర్టు ఆగ్రహం