Leopard Sighting | మోపాల్​ శివారులో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

మోపాల్​ మండల శివారులో చిరుత సంచారం కలకలం రేపింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Leopard Sighting | మోపాల్​ మండల శివారులో చిరుత సంచారం కలకలం రేపింది.. దీంతో రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Leopard Sighting | మోతీరాం నాయక్​ తండాలో..

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్​ మండలం (Mopal Mandal) మోతీరాం నాయక్​ తండా నుంచి కాల్పోల్​ వెళ్లే దారిలో శుక్రవారం కొందరికి చిరుత కనిపించింది. దీంతో భయాందోళనలకు గురైన వారు వెంటనే సమీప గ్రామాల ప్రజలకు అలర్ట్​ చేశారు. శనివారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు చిరుత ఆనవాళ్లు తెలుసుకునేందుకు మోపాల్​ గ్రామాన్ని సందర్శించారు. ప్రస్తుతానికి ఒంటరిగా రాత్రివేళల్లో బయటకు రావొద్దని.. అత్యవసరమైతే తప్ప అటవీప్రాంతం వైపు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి..: DCM Truck Accident | లారీని ఢీకొట్టిన డీసీఎం: డ్రైవర్ దుర్మరణం, క్లీనర్‌కు తీవ్ర గాయాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *