DCM Truck Accident | లారీని ఢీకొట్టిన డీసీఎం: డ్రైవర్ దుర్మరణం, క్లీనర్‌కు తీవ్ర గాయాలు

లారీని డీసీఎం ఢీకొట్టింది.. 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: DCM Truck Accident | లారీని డీసీఎం ఢీకొట్టింది.. 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

DCM Truck Accident | చంద్రాయన్​పల్లి శివారులో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం (Indalwai Mandal) చంద్రాయన్ పల్లి శివారులో తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న డీసీఎం, లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు ధ్రువీకరించారు. డీసీఎంలో ఉన్న క్లీనర్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి..: Power Cuts Farmers | కరెంటు కోతలతో కన్నెర్ర చేసిన రైతన్న.. రోడ్డుపై రాస్తారోకో..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *