అక్షరటుడే వెబ్‌డెస్క్: Meta Ultimatum | ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి కొంతసేపు తొలగించిన వ్యవహారంలో ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం మెటా సంస్థకు మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది. ఆ లోపు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పార్లమెంట్ ప్యానెల్ అధ్యక్షుడు నిశికాంత్ దూబే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహించే దేశ ప్రధాని వీడియోను తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడితో సమానమని పేర్కొన్నారు.
Meta Ultimatum | చట్టపరమైన చర్యలు..
ఈ వివాదంలో మెటా తగిన చర్యలు తీసుకోకపోతే, సోషల్ మీడియా కంపెనీలకు లభించే చట్టబద్ధ రక్షణ (సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్) రద్దు అవుతుందని ప్యానెల్ హెచ్చరించింది. ఈ క్లాజ్ తొలగిస్తే ప్లాట్‌ఫామ్ అధికారులపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. మెటా ఈ ఘటనకు ఆటోమేటిక్ సాంకేతిక లోపమే కారణమని గతంలో వివరణ ఇచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం , పార్లమెంట్ ప్యానెల్ ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఇది కేవలం టెక్నికల్ సమస్య కాదని, జాతీయ భద్రత , శాంతిభద్రతలకు సంబంధించిన కీలక అంశమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
Meta Ultimatum | ఏం జరిగిందంటే?
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా దిల్లీలో విద్యార్థులు నిరసనలు చేపట్టిన సమయంలో ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. ‘‘స్నేహితులారా.. పేపర్ లీక్ అనేది సాధారణ అంశం కాదని నాకు తెలుసు..’’ అంటూ సాగిన ఈ జెన్-జీ స్టైల్ వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే, కొంతసేపు అది ఆయన ఖాతా నుంచి మాయం కావడం, ఆ తర్వాత మళ్లీ ప్రత్యక్షం కావడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో రాబోయే రోజుల్లో మెటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
మెటాకు బిగ్ షాక్: మార్క్ జుకర్‌బర్గ్‌కు 3 రోజుల గడువు
ప్రధాని మోదీ వీడియో తొలగింపు సహా పలు అంశాలపై వివరణ ఇవ్వాలని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.
కేసుల నుంచి లభించే ‘సేఫ్ హార్బర్’ రక్షణ రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని, సీఎస్ఏఎమ్ (CSAM) కంటెంట్… pic.twitter.com/j4zQkQ8q6S
— ఉదయం (@udayamdigital) August 5, 2026
ఇది కూడా చదవండి: SRSP Flood Inflow | ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద.. 36 టీఎంసీలకు చేరిన నీటినిల్వ