SRSP Flood Inflow | ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద.. 36 టీఎంసీలకు చేరిన నీటినిల్వ

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: SRSP Flood Inflow | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. బుధవారం ఉదయం 9 గంటల వరకు ప్రాజెక్టులోకి 33,208 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.

SRSP Flood Inflow | విష్ణుపురి.. బాలేగావ్​..

విష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టులు దాదాపు 99 శాతం నిండిన నేపథ్యంలో శ్రీరాంసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి నిల్వ సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,076.50 అడుగుల వద్ద 36.27 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1,078.20 అడుగుల వద్ద 40.304 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం సుమారు 4 టీఎంసీల మేర తక్కువగా ఉంది.

SRSP Flood Inflow | కొనసాగుతున్న నీటి విడుదల

ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 423 క్యూసెక్కులు కలిపి మొత్తం 954 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్టులోకి వరద నీరు కొనసాగుతుండటంతో శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: GGH Newborn Body | జీజీహెచ్​లో దారుణం.. ఆస్పత్రి డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *