RBI Repo Rate | వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్‌ మల్హోత్రా బుధవారం వెల్లడించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ‌్‌డెస్క్: RBI Repo Rate | రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్‌ మల్హోత్రా ( Sanjay Malhotra )బుధవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ సవరించకపోవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

RBI Repo Rate | ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు కోత ..

ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్‌, జూన్‌లో జరిగిన సమీక్షల్లోనూ వడ్డీరేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ మార్చలేదు. అయితే, గత సంవత్సరం మాత్రం వడ్డీరేట్లను పలుమార్లు సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున తగ్గించిన ఆర్‌బీఐ.. జూన్‌ సమీక్షలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. ఆ తర్వాత డిసెంబరులో మరో పావుశాతం తగ్గించడంతో, గత సంవత్సరం మొత్తంగా రెపో రేటు 1.25 శాతం వరకు తగ్గిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి:  ED Raids Hyderabad | హైదరాబాద్​లో ఈడీ సోదాల కలకలం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *