అక్షరటుడే వెబ్‌డెస్క్: Family Register Telangana | రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులభంగా అందించేందుకు తెలంగాణ ( Telangan )ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే ‘కుటుంబ రిజిస్టర్’ (Family Register) విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
Family Register Telangana | అధికారిక రికార్డు రూపంలో..
ఈ నూతన విధానం ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర వివరాలు అధికారిక రికార్డు రూపంలో భద్రంగా ఉంటాయి. దీనివల్ల పౌరులు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ధ్రువీకరణ పత్రాలు పొందడానికి పదే పదే అధికారుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తొలగిపోతాయి. అర్హులైన వారు మీ-సేవ (Meeseva) కేంద్రాల ద్వారా అధికారికంగా ‘కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్’ పొందవచ్చు.
Family Register Telangana | దరఖాస్తు విధానం..
ప్రజలు ఈ సర్టిఫికెట్ కోసం నేరుగా మీ-సేవ కేంద్రాలను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ‘మీ-సేవ ఆన్‌లైన్ పోర్టల్’ , అధికారిక మొబైల్ యాప్ ద్వారా కూడా సులభంగా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను పెంచడంతో పాటు, ప్రజలకు సమయం , శ్రమ ఆదా అయ్యేలా ఈ కుటుంభ రిజిస్టర్ వ్యవస్థను త్వరలోనే పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Singareni Losses | సింగరేణి నష్టాలపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు