Sanjay Jaju | తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sanjay Jaju | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకానికి సంబంధించి ప్రభుత్వం జీఓ నంబర్ 911 ద్వారా ఉత్తర్వులను జారీ చేసింది.

Sanjay Jaju | గవర్నర్ ఆదేశాల మేరకు ..

ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే, సంజయ్ జాజు ఆ బాధ్యతలను స్వీకరిస్తారు. గవర్నర్ ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసింది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న సంజయ్ జాజును ఈ అత్యంత కీలకమైన పదవికి ఎంపిక చేయడంపై సచివాలయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

sanjay.1

ఇది కూడా చదవండి:  Child Marriage Prevention | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పెళ్లి కార్డులపై పుట్టిన తేదీలు తప్పనిసరి!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *