అక్షరటుడే వెబ్‌డెస్క్: Tyra Banks Diwali Look | అంతర్జాతీయ ఫ్యాషన్ ఐకాన్, ‘అమెరికాస్ నెక్స్ట్ టాప్ మోడల్’ షో ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సూపర్ మోడల్ టైరా బ్యాంక్స్ (Tyra Banks) న్యూయార్క్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల కోసం ఆమె ప్రముఖ ఆభరణాల సంస్థ ‘కళ్యాణ్ జువెలర్స్’ (Kalyan Jewellers) రూపొందించిన దివ్యమైన నగలనలంకరించుకుని రాయల్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఒక అంతర్జాతీయ సెలబ్రిటీ పూర్తిస్థాయి భారతీయ సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలను ధరించడం ఇదే తొలిసారి.
Tyra Banks Diwali Look | ప్రత్యేక ఆభరణాలు..
ఈ వేడుక కోసం టైరా బ్యాంక్స్ ధరించిన ఆభరణాలను కళ్యాణ్ జువెలర్స్ న్యూజెర్సీ షోరూమ్ నుండి ప్రత్యేకంగా ఎంపిక చేశారు. సంప్రదాయబద్ధంగా చేతితో రూపొందించిన నాచురల్ డైమండ్ చౌకర్, జుంకాలు, మాంగ్ టిక్కా (పాపిడి బిళ్ళ), ఒడ్డాణం , ఉంగరాలను ఆమె ధరించారు. ‘మేసన్ టై’ (Maison Tai) ఫ్యాషన్ హౌస్ రూపొందించిన ప్రత్యేకమైన భారతీయ దుస్తుల్లో టైరా బ్యాంక్స్ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించారు.
Tyra Banks Diwali Look | అమెరికాలో ప్రధాన పండుగగా..
దీపావళి పండుగ కేవలం భారతీయులకే పరిమితం కాకుండా, అమెరికన్ ప్రధాన స్రవంతి సంస్కృతిలోనూ భాగమవుతోందనడానికి టైరా బ్యాంక్స్ రూపం ఒక ఉదాహరణగా నిలిచింది. అమెరికాలోని ఎడిసన్ (న్యూజెర్సీ), షికాగోలలో కళ్యాణ్ జువెలర్స్ షోరూమ్‌లను ప్రారంభించిన తర్వాత, యుఎస్‌లో ఈ బ్రాండ్ జరుపుకుంటున్న రెండవ దీపావళి వేడుక ఇది.
ఇది కూడా చదవండి: Keesara SI Bribery | ఛార్జీషీటు దాఖలు కోసం రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై