అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mahesh Goud Arrest | టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ‘చలో లోక్ భవన్ (రాజ్ భవన్)’ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా లోక్ భవన్‌కు బయలుదేరారు.
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరితో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకొని పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు. ఠాణాలో సైతం కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు.
Mahesh Goud Arrest | అరెస్ట్ అప్రజాస్వామికం
ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్‌ను జేబులో పెట్టుకొని ఎన్నికల వ్యవస్థను మోదీ పాడు చేశారని విమర్శించారు. తెలంగాణలో అధికారంలో ఉన్నంత మాత్రాన కేంద్రంపై నిరసన తెలపకూడదా అని ప్రశ్నించారు. సీఈసీని సస్పెండ్ చేసి బెంగాల్, బీహార్ ఎన్నికలపై న్యాయ విచారణ జరపాలన్నారు. ఢిల్లీలో రాహుల్, ప్రియాంకల అరెస్ట్ ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి..: Rice Prices Telangana AP | బియ్యం ధరలకు రెక్కలు..? మరీ సామాన్యులకు తిప్పలేనా?