అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amazon Job Cuts | ఏఐ ప్రభావంతో సాఫ్ట్వేర్ రంగంలో వేలాది మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. రాత్రికి రాత్రే పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఒక మెయిల్‌తో వారికి ఉద్వాసన పలుకుతున్నాయి. దీంతో టెకీలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అమెజాన్ (Amazon) మరో 1000 మంది ఉద్యోగులను తొలగించింది.
కంపెనీ రిటైల్ వ్యాపారంలోని కొన్ని భాగాలతో సహా, అనేక బృందాలలో సిబ్బందిని తొలగించారు. భారత్, అమెరికా, యూకేలోని ఉద్యోగులపై ఈ కోతలు ప్రభావం చూపుతాయి. ప్రపంచవ్యాప్తంగా 1,000 కంటే తక్కువ వైట్-కాలర్ ఉద్యోగులు ప్రభావితమైనట్లు సమాచారం. దీనిపై అమెజాన్ స్పందిస్తూ.. కొంతమందిని మాత్రమే తొలగించామని తెలిపింది. ఇ-కామర్స్ కార్యకలాపాలను నిర్వహించే ‘స్టోర్స్’లలో ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది.
Amazon Job Cuts | పలు విభాగాల్లో..
కస్టమర్ సర్వీస్, సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్, మార్కెట్‌ప్లేస్ సపోర్ట్‌కు సంబంధించిన బృందాలు ప్రభావితమయ్యాయి. అమెజాన్ రిటైల్ కార్యకలాపాలలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు కూడా దెబ్బతిన్నాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి అమెజాన్ 2025 చివరి నుండి 2026 జనవరి మధ్య సుమారు 30,000 ఉద్యోగాలను తొలగించింది. తాజా తొలగింపులు తక్కువే అయినా.. ఇంకా కోతలు ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి..: CJP Protest Bengaluru | సీజేపీ ఆందోళన.. బెంగళూరులో టెన్షన్