CJP Protest Bengaluru | సీజేపీ ఆందోళన.. బెంగళూరులో టెన్షన్​

సీజేపీ ఆందోళన నేపథ్యంలో బెంగళూరులో హై టెన్షన్​ నెలకొంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : CJP Protest Bengaluru | బెంగళూరులో హై టెన్షన్​ నెలకొంది. సీజేపీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​ జ్ఞానేశ్​ కుమార్​ రాజీనామా చేయాలని ఫ్రీడమ్‌ పార్కు వేదికగా సీజేపీ నిరసన చేపట్టింది.

కర్ణాటకలో ఎస్​ఐఆర్​లో తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలని నిరసనకారులు డిమాండ్​ చేశారు. సీజేపీ ఆందోళనకు ధృవ్ రాఠే మద్దతు ప్రకటించారు. ఆయనతో పాటు నటుడు ప్రకాశ్​రాజ్​ సైతం ఆందోళనల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 10న జరగనున్న తమ నిరసనకు ముందుగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ (Gyanesh Kumar)కు వ్యతిరేకంగా ఐక్య సమీకరణకు సీజేపీ, ఏఐఎస్ఏ ఇతర విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

CJP Protest Bengaluru | హాజరైన ఎస్​ఐఆర్​ బాధితులు

బెంగళూరులో ఒక ‘ప్రజా న్యాయస్థానం’ నిర్వహిస్తున్నట్లు ప్రకాశ్ రాజ్​ తెలిపారు. ఇందులో కర్ణాటక వ్యాప్తంగా ఉన్న ఎస్ఐఆర్ బాధితులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషనర్​ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్​ చేశారు. నిరసన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు.

ఇది కూడా చదవండి..: Starlink India Services | భారత్​లో ‘స్టార్​లింక్’ సేవలను అడ్డుకుంటున్న కుబేరులు : ఎలాన్​ మస్క్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *