12 Hours Free Power | 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీసం 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని దినేష్ కుమార్ కులాచారి డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్‌పల్లి: 12 Hours Free Power | రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీసం 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని బీజీపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ కులాచారి డిమాండ్​ చేశారు.  డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి, రాంపూర్, కమలాపూర్ గ్రామాలలో నీరు లేక ఎండిపోతున్న వరి పంటలను దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

12 Hours Free Power | పంటలు ఎండిపోయి..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ అంతటా కరువు పరిస్థితులు దాపురించాయని, ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తీవ్రంగా నష్టపోతోందని దినేష్ కులచారి (Dinesh Kulchari) మండిపడ్డారు. పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్న రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శంకుస్థాపనలు, ఇతర ప్రాంతాల్లో పర్యటనలకే సమయం కేటాయిస్తున్నారని, పంటలు ఎండిపోయి కన్నీరు పెడుతున్న రైతులను పరామర్శించేందుకు రావడం లేదన్నారు. సొంత నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని చెప్పిన ఎమ్మెల్యే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో జాడ లేకుండా పోయారని వ్యాఖ్యానించారు.

మిగిలి ఉన్న పంటలనైనా కాపాడేందుకు రోజుకు 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయాలని,నీరు, కరెంట్ లేక ఎండిపోయిన పంటలకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం స్పందించకపోతే రైతులను పెద్ద ఎత్తున సమీకరించి, కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రకాంత్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు జిల్లా వెల్మ గంగారెడ్డి, నాయకులు ఓంసింగ్, దేశపతి శీను, గణేష్, ప్రదీప్, సురేష్, నవీన్, రత్నం ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Taekwondo Championship | క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *