Taekwondo Championship | క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలి..

క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలని అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Taekwondo Championship | క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలని అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య అన్నారు. నగరంలోని​ బస్వాగార్డెన్​లో అమెచ్యూర్​ తైక్వాండో అసోసియేషన్​ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Taekwondo Championship | ఓడినవారు నిరత్సాహపడొద్దు..

జిల్లా స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణ (Telangana) రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. తైక్వాండో సాధన ద్వారా శరీరాన్ని చురుకుగా, క్రమశిక్షణతో, దృఢంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన వారితో పాటు ఎల్లో బెల్ట్ కేటగిరీలో విజయం సాధించలేకపోయిన క్రీడాకారులు కూడా నిరుత్సాహపడకుండా, ఈ అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకుని మరింత కష్టపడి తదుపరి అవకాశంలో విజయం సాధించాలని ఆయన ప్రోత్సహించారు. ఓటమిని అంగీకరించి వెనుకడుగు వేయకుండా, పట్టుదలతో మళ్లీ ప్రయత్నించాలని క్రీడాకారులకు సూచించారు.

Taekwondo Championship | 100మందికి పైగా క్రీడాకారులు

ఈ పోటీలకు యూనివర్సల్ తైక్వాండో అకాడమీ, వారియర్స్ అకాడమీ, ఛాంపియన్స్ టైక్వాండో అకాడమీ, అమేజింగ్ టైక్వాండో అకాడమీ తదితర అకాడమీలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 100 మందికి పైగా హాజరైన క్రీడాకారులకు క్యూరోగి, పూమ్సే విభాగాలతో పాటు వివిధ వయస్సు, బరువు కేటగిరీల్లో విభజించి పోటీలు నిర్వహించారు. క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూ, శిక్షణకు పంపుతున్న తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్న కోచ్ జేసీ మనోజ్ కుమార్​ను అభినందించారు. ఈ సందర్భంగా అకాడమీ కోచ్‌లు గంగాధర్, నాగరాజ్, శివకుమార్, వినయ్ తదితరులను అభినందించారు.

ఇది కూడా చదవండి..: RTC Bus Accident | డ్రైవర్ నిర్లక్ష్యం.. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *