అక్షర టుడే, ఎల్లారెడ్డి: Cylinder Blast Fire | గుడిసెల్లో ఎగిసిపడిన వంటలు ఆ కుటుంబాల్లో చీకటి చేసింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సాతలి గ్రామంలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు సిలిండర్ పేలడంతో రెండు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో గ్రామానికి చెందిన కల్లేటి మైసయ్య, పసుపుల అంజయ్య కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి.

మైసయ్య ఇంట్లో సాయంత్రం పూట సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పక్కనే ఉన్న అంజయ్య గుడిసెతోపాటు సాయిలు గడ్డివాము, పెంటకుప్పలకు సైతం మంటలు అంటుకున్నాయి.

వెంటనే ఎల్లారెడ్డి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే రెండు నివాసపు గుడిసెలు పూర్తిగా బూడిదయ్యాయి.

Cylinder Blast Fire | నష్టం అంచనా, ఆదుకుంటాం
ఈ ప్రమాదంలో కట్టుబట్టలు, నిత్యావసర వస్తువులు, బియ్యం, పాత్రలు, ఇతర గృహోపకరణాలన్నీ కాలిపోయాయి. ఇప్పుడు ఉండేందుకు నీడ లేదని, తినేందుకు తిండి లేదని, కట్టుకునేందుకు దుస్తులు లేవని బాధిత కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.

రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ సహాయం అందజేస్తామని అధికారులు బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Rowdy Sheeter Rampage | తల్వార్‌తో రౌడీ షీటర్ వీరంగం.. కేసు నమోదు