Rowdy Sheeter Rampage | తల్వార్‌తో రౌడీ షీటర్ వీరంగం.. కేసు నమోదు

సల్మాన్ తల్వార్‌తో బతుకమ్మ కుంట ప్రాంతంలో వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: Rowdy Sheeter Rampage | కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట ప్రాంతంలో తల్వార్‌తో హంగామా సృష్టించిన రౌడీ షీటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పట్టణ సీఐ నరహరి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Rowdy Sheeter Rampage | కొంతకాలంగా విభేదాలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో బతుకమ్మ కుంట ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రౌడీ షీటర్‌గా ఉన్న సల్మాన్, హర్షద్‌ల మధ్య గోడకు సంబంధించిన వివాదం కారణంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య కొంతకాలంగా ఈ అంశంపై విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో సల్మాన్ తల్వార్‌తో బతుకమ్మ కుంట ప్రాంతంలో వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం బాధితుడు హర్షద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ నరహరి తెలిపారు.

నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

School Kitchen Shed | బడి రుణం.. తమ్ముడి స్మరణం: సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థి అక్షరార్చన!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *