అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad chain snatching | నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 8:30 గంటల సమయంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అపరిచిత వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు కంట్రోల్ రూమ్ అధికారులకు సమాచారం అందింది.
Bankers Books Bill | 135 ఏళ్ల బ్రిటిష్ చట్టానికి గుడ్‌బై..డిజిటల్ బ్యాంకింగ్‌కు కొత్త చట్టం!
Nizamabad chain snatching | నిందితుల ఆనవాళ్లు..
ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు Police కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నగరంలోని అన్ని పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ (BCN), పెట్రో కార్స్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితుల కదలికలను కనిపెట్టేందుకు ప్రధాన కూడళ్లలో తనిఖీలు తీవ్రం చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితులు ప్యాషన్ ప్రో (Passion Pro)( TG 16C 6043) పై వచ్చారు. ముందు కూర్చున్న వ్యక్తి (రైడర్) ఆకుపచ్చ (గ్రీన్) రంగు టీ-షర్ట్, ఇక వెనుక కూర్చున్న వ్యక్తి తెల్లటి (వైట్) రంగు షర్ట్ ధరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఆనవాళ్లు కలిగిన బైక్, వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు కానీ, కంట్రోల్ రూమ్‌కు కానీ సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరారు.