అక్షరటుడే, వెబ్డెస్క్ : Woman Attacked | నిజామాబాద్ (Nizamabad) నగరంలోని బంగారు మైసమ్మ కాలనీలో ఓ వృద్ధురాలిపై దుండగుడు దాడి చేశాడు. ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బంగారు చెవి కమ్మలు లాక్కెళ్లాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
బంగారు మైసమ్మ కాలనీలో అరుంధతి అనే వృద్ధురాలి నివాసం ఉంటుంది. నితిన్ అనే వ్యక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. చెవి కమ్మలు, రూ.500 తీసుకున్నాడు. చెవి కమ్మలు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ ఇంట్లో అందుబాటులో ఉన్న కత్తెర తో ఆమె చెవికి ఒక గాయపరిచి కమ్మలు లాక్కున్నాడు. అనంతరం గడ్డపారతో ఆమెపై దాడి చేశాడు.
Woman Attacked | నిందితుడి అరెస్ట్
ఈ ఘటనలో అరుంధతి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని త్రీ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీనిని కూడా చదవండి : RJ Charan Bigg Boss | రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ హౌస్కు.. నిజామాబాద్ కుర్రాడి జోరు