అక్షరటుడే, బోధన్: Hazrat Shah Jalal Bukhari | పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ దర్గాలో ఉర్సు భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) దర్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
Hazrat Shah Jalal Bukhari | చాదర్ సమర్పించి..
ఈ సందర్భంగా దర్గా వద్ద పోలీస్ కమిషనర్ సంప్రదాయబద్ధంగా చాదర్ సమర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని.. సమాజంలో శాంతి.. సామరస్యం సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు సీపీని స్వాగతించారు.. ఉర్సు మహోత్సవాల్లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ ఎస్హెచ్వో వెంకట్ నారాయణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మీర్ ఇలియాస్ అలీ, దర్గా కార్యదర్శి ముక్తాదార్, మత పెద్దలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bhavesh Mishra IAS Collector | నిజామాబాద్ కలెక్టర్‌గా నిర్మల్ కలెక్టర్ భావేష్ మిశ్రాకు బాధ్యతలు!