Meta India FIR | మెటా భారత విభాగాధిపతిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై స్పందించిన సంస్థ

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Meta India FIR | సీజేపీ నేతృత్వంలోని నీట్ పేపర్ లీక్ ఆందోళనల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని లక్ష్యంగా చేసుకుని, మార్ఫింగ్ చేసిన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పెట్టారన్న ఆరోపణలపై పలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నిర్వాహకులపై, మెటా భారత విభాగాధిపతిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేయగా.. కంపెనీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాము సంబంధిత ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి సహకరిస్తున్నామని పేర్కొంది.

Meta India FIR | మెటా ఏమందంటే..

కేసు నమోదుపై స్పందిస్తూ.. “మేము సంబంధిత ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ విషయాన్ని పరిష్కరించడానికి వారికి సహకరిస్తున్నాం” పేర్కొంది.

Meta India FIR | ప్రధానిని అవమానిస్తూ పోస్టులు

ప్రధానమంత్రిని అవమానిస్తూ మార్ఫింగ్, డిజిటల్‌గా మార్పులు చేసిన అనేక వీడియోలు, చిత్రాలు తమకు కనిపించాయని ఇద్దరు వ్యక్తులు చేసిన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి..: India Foreign Policy Conference | భారత విదేశాంగ విధానంపై జాతీయ సదస్సు..సమకాలీన సవాళ్లపై నిపుణుల విశ్లేషణ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *