Sriram Sagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకునేనా..!?

ఉత్తర తెలంగాణకు జీవనాడి అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా శోభ సంతరించుకోనుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Sriram Sagar Project | ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా శోభ సంతరించుకోనుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, సౌకర్యాల కల్పనపై తాజాగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Sriram Sagar Project | మంత్రుల రాక నేపథ్యంలో..

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లోని ప్రధాన ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్. ఆరు లక్షల ఆయకట్టు రైతులు ఈ ప్రాజెక్టుపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తుంటారు. అలాంటి ప్రాజెక్టు గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రతినిత్యం డ్యాంను చూడటానికి ఎక్కడెక్కడ నుంచో పర్యటకులు వస్తుంటారు. పర్యాటకులకు కనీస వసతులు లేకపోవడం పర్యాటకులకు నిరాశను కలిగిస్తోంది. ప్రస్తుతం ఇద్దరు మంత్రుల పర్యటన నేపథ్యంలో శ్రీరాం సాగర్ పర్యాటక కేంద్ర అభివృద్ధి విషయంలో ఏమైనా నిధులు మంజూరు చేస్తారా అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.

Sriram Sagar Project | పర్యటన వివరాలు..

మంత్రులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రాజెక్టు పనులు, నీటి నిల్వలు, కాలువల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎస్సారెస్పీని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అనంతరం నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును మధ్యాహ్నం 1.35 నుండి 2.20 వరకు, పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టును సాయంత్రం 3:50 నుండి 4:50 వరకు మంత్రులు సందర్శించనున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

Sriram Sagar Project | భారీ బందోబస్తు..

మంత్రుల పర్యటన నేపథ్యంలో నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన వైర్‌లెస్ సందేశం మేరకు మూడు జిల్లాల కలెక్టర్లు ప్రోటోకాల్, బస, రవాణా ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, రామగుండం, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు మంత్రులకు పైలట్, ఎస్కార్ట్, భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశాయి. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలులో ఉంటాయి.ప్రాజెక్టుల పరిశీలన అనంతరం రైతులకు సాగునీటి సరఫరా, ప్రాజెక్టుల ఆధునీకరణపై మంత్రులు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Hazrat Shah Jalal Bukhari | హజ్రత్ షా జలాల్ బుఖారీ దర్గాలో సీపీ ప్రార్థనలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *