Pravashree India Record | ‘గాంధారి విద్య’తో ప్రవశ్రీ అద్భుతాలు.. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు

‘గాంధారి విద్య’తో ఈ చిన్నారి అద్భుతాలు చేస్తోంది. తన ప్రతిభతో ‘ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్’​లో చోటు సంపాదించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: ‘గాంధారి విద్య’తో ఈ చిన్నారి అద్భుతాలు చేస్తోంది. తన ప్రతిభతో ‘ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్’​లో చోటు సంపాదించింది.

Pravashree India Record | కళ్లకు గంతలు కట్టుకుని విన్యాసాలు

నగరంలోని ప్రెసిడెన్సీ హైస్కూల్​లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని కె. ప్రవశ్రీ కళ్లకు గంతలు కట్టుకుని ఒకసారి ఐదు విన్యాసాలు చేయడంలో ఆరితేరింది. ‘గాంధారి విద్య’గా పేరుగాంచిన ఈ విన్యాసాలను ఏకకాలంగా ప్రదర్శించి ఔరా అనిపిస్తోంది. నగరంలోని వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమ్మర్ క్యాంప్​లో కె.ప్రవశ్రీ ‘గాంధారి విద్య’ ప్రదర్శనతో అబ్బురపర్చింది. ఒకేసారి ఓవర్ బోర్డ్ మీద స్కేటింగ్, హులా హూప్ రింగ్ నడుము చుట్టూ తిప్పడం, తలపై దీపం పెట్టుకొని డాన్స్ స్టెప్స్ వేస్తూ, 2×2 రూబిక్స్ క్యూబ్​ను క్షణాల్లో సాల్వ్​ చేయడం, వీటన్నింటిని కళ్లు కనిపించకుండా సమతుల్యంగా చేయడం ద్వారా ఆమె ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సాధించింది.

Pravashree India Record | కష్టమైన ఈ విన్యాసాలు..

Pravashree India Record

చూడడానికే కష్టమైన ఈ విన్యాసాలను ప్రవశ్రీ చిరునవ్వుతో, ఎలాంటి తడబాటు లేకుండా పూర్తి చేసింది. ఈ విన్యాసాలను గుర్తించిన ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్ (India Book of Records)​ ప్రతినిధులు  ఆమె రికార్డుకు గుర్తిస్తూ మెడల్​, సర్టిఫికెట్​, పెన్​, ఐడీ కార్డు అందజేశారు. ఆస్ట్రేలియా, దుబాయ్, ఇటలీ వంటి దేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చిన కె. ప్రవశ్రీ తన గురువు నవనీత మార్గదర్శకత్వంలో రికార్డు క్రియేట్​ చేసింది. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు సాయిప్రసాద్​, వైష్ణవి మాట్లాడుతూ ‘కళ్లు మూసుకున్నా మనసు తెరిస్తే ఏదైనా సాధించొచ్చని’ ప్రవశ్రీ నిరూపించిందన్నారు. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో (India Book of Records‌)లో స్థానం సంపాదించడం తమ జీవితంలో గుర్తుండిపోయే క్షణమన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana University Water Crisis | తెయూలో నీటి కటకట.. రోడ్డెక్కిన విద్యార్థినులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *