అక్షరటుడే వెబ్‌డెస్క్: H-1B Visa | అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులు అత్యంత కీలకంగా భావించే H-1B వీసా ప్రక్రియపై అమెరికా ప్రభుత్వం దృష్టి సారించింది. వీసా నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలపై యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది.
H-1B Visa | అమెరికన్లకే ప్రాధాన్యత..
ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ( స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ( US )ఉద్యోగ అవకాశాలు మొదట తమ దేశ పౌరులకే దక్కాలని ఆయన స్పష్టం చేశారు. కొన్ని కంపెనీలు తక్కువ వేతనాలకే విదేశీయులను పనిలోకి తీసుకునేందుకు H-1B వీసా వ్యవస్థలోని లూప్‌హోల్స్‌ను ఆసరాగా చేసుకుంటున్నాయని, ఇటువంటి మోసాలను ఇకపై సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఫేక్ డాక్యుమెంట్లతో అక్రమాలకు పాల్పడే ఐటీ సంస్థలు, కన్సల్టెన్సీల భరతం పడతామని హెచ్చరించారు.
H-1B Visa | అక్రమాల వెనుక గుట్టు..
దర్యాప్తులో భాగంగా కొన్ని సంస్థలు ఒకే అభ్యర్థి పేరుతో పలుమార్లు దరఖాస్తులు చేసి, వీసా లాటరీలో గెలిచే అవకాశాలను అక్రమంగా పెంచుకుంటున్నట్లు USCIS గుర్తించింది. నిబంధనలను అతిక్రమించిన కంపెనీలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు, ఇప్పటికే మంజూరైన వీసాలను కూడా రద్దు చేసే దిశగా అధికారులు యోచిస్తున్నారు.
H-1B Visa | టెక్కీల్లో టెన్షన్..
అమెరికా ప్రభుత్వం చేపట్టిన ఈ తాజా దర్యాప్తు నిర్ణయం, ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న వేలమంది భారతీయ ఐటీ నిపుణుల్లో కలవరాన్ని రేకెత్తిస్తోంది. వీసా దరఖాస్తు ప్రక్రియ మరింత కఠినతరం కావడంతో, భవిష్యత్తులో అవకాశాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వారిలో మొదలైంది.
ఇది కూడా చదవండి: Shamshabad Bolero Accident | శంషాబాద్‌లో బొలెరో బీభత్సం.. ఇద్దరు మహిళల మృతి