Prayagraj Tirunelveli Special Train | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రయాగ్‌రాజ్-తిరునెల్వేలి మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Prayagraj Tirunelveli Special Train | ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్‌రాజ్ నుంచి తిరునెల్వేలి మధ్య వరంగల్, విజయవాడ ( Vijayawada ) మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది.

Prayagraj Tirunelveli Special Train | రైళ్ల రాకపోకల వివరాలు..

ప్రయాగ్‌రాజ్ నుంచి తిరునెల్వేలికి (04171) నడిచే ప్రత్యేక రైలు ఆగస్టు 1 నుంచి 22 వరకు ప్రతి శనివారం చొప్పున మొత్తం నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటుంది. తిరునెల్వేలి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు (04172) నడిచే మరో ప్రత్యేక రైలు ఆగస్టు 3 నుంచి 24 వరకు ప్రతి సోమవారం  నాలుగు సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందించనుంది.

Prayagraj Tirunelveli Special Train | ఈ స్టేషన్లలో ఆగుతుంది

ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లోనూ మాణిక్‌పూర్, సత్నా, కట్ని, జబల్‌పూర్, ఇటార్సి, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జోలార్‌పేట, సేలం, నమక్కల్, కరూర్, దిండిగుల్, మదురై, విరుధునగర్, సాత్తూర్, కోవిల్‌పట్టి తదితర ప్రముఖ స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లలో ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్ , జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  India Hockey Jersey | భారత హాకీ జట్టు జెర్సీ రంగు మార్పు .. ఇది చరిత్ర మార్చే కుట్రే అంటూ ప్రియాంకా గాంధీ ఫైర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *