RBI Monetary Policy | అందరి చూపు ఆర్బీఐ వైపు..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RBI Monetary Policy | పశ్చిమాసియాలో నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్, అమెరికా టారిఫ్‌లతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి.

అమెరికా, ఇరాన్‌ల మధ్య మూడు నెలలుగా సాగుతున్న యుద్ధంతో క్రూడ్ ఆయిల్ (Crude oil) ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ద్రవ్యోల్బణం సైతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నేతృత్వంలో జరుగుతున్న మూడు రోజుల ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

RBI Monetary Policy | వడ్డీ రేట్లు యథాతథమేనా?

ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ బుధవారం ప్రారంభమైంది. శుక్రవారం ముగియనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు సమావేశం తీర్మానాలను వెల్లడించనున్నారు. ఈ సమావేశంలో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆర్బీఐ చైర్మన్ ఎలాంటి కామెంట్లు చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొని ఉన్న పరిస్థితులను గమనిస్తే.. ఆర్బీఐ ఈసారి వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఇటీవల ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక వంటి అనేక వర్ధమాన ఆర్థిక వ్యవస్థలలో అనూహ్యంగా వడ్డీ రేట్ల పెంపు కనిపించింది. దీంతో రూపాయికి మద్దతుగా ఆర్బీఐ సైతం తన విధానాన్ని కఠినతరం చేస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

RBI Monetary Policy

RBI Monetary Policy | కామెంటరీపై ఫోకస్..

ఆర్బీఐ రెపో రేట్లను యథాతథంగా ఉంచినా.. ఆర్బీఐ గవర్నర్ ఏం చెబుతారన్న అంశంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. రాబోయే నెలల్లో వచ్చే కొత్త ఆర్థిక పురోగతి, ద్రవ్యోల్బణ గణాంకాలను సమీక్షించిన తర్వాతే కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు లేదా పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దేశీయంగా ఎల్ నినో పరిస్థితులు, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జీడీపీ వృద్ధి, రూపాయి బలహీనత, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ఆర్బీఐ గవర్నర్ ఎలాంటి కామెంట్లు చేస్తారోనని అందరూ ఆసక్తితో గమనిస్తున్నారు.

 RBI Monetary Policy

ఇది కూడా చదవండి..: Congress Rajya Sabha Candidates | రాహుల్ గాంధీ సన్నిహితులకు పెద్దపీట: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *