Family Register Certificate | దొంగ ఓట్ల నమోదు కోసమే ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్'ను ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకోకూడదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Family Register Certificate | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ను ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకోకూడదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి (Dinesh Kulachari) పేర్కొన్నారు. ఈ మేరకు నాయకులతో కలిసి గురువారం అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం సమర్పించింది.

Family Register Certificate | హడావుడిగా తేవడంలో మతలబేంది..?

దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25వ తేదీన ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ను హడావిడిగా తీసుకువచ్చిందన్నారు. రేషన్ కార్డుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసి, మీ సేవా కేంద్రాల ద్వారా సర్టిఫికెట్లు జారీ చేస్తామని చెబుతోందన్నారు. కానీ సరిగ్గా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఈ కొత్త సర్టిఫికెట్ తీసుకురావడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఇది ముమ్మాటికీ అధికార కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షంమైన ఎంఐఎం (AIMIM) కలిసి దొంగ ఓట్లను నమోదు చేయడానికి పన్నిన వ్యూహమని ఆరోపించారు.

Family Register Certificate | ఈ సర్టిఫికెట్‌ను అడ్డం పెట్టుకుని

ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, సీఎం రేవంత్​రెడ్డికి విన్నవించిన వెంటనే ఈ జీవో రావడం చూస్తుంటే, ఈ సర్టిఫికెట్‌ను అడ్డం పెట్టుకుని భారతదేశానికి చెందని వారిని ఓటర్లుగా చేర్పించుకోవాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఈ ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ను ఒక ప్రామాణిక పత్రంగా ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించకూడదని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్​కార్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీ నారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, చింత శ్రీనివాస్ రెడ్డి, ఓంసింగ్, విజయ్ కృష్ణ, వంశీ గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మారెడ్డి వనీత, పంచరెడ్డి అనిత, బెల్లాల్ శశాంక్, రమేష్, రాజేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Banswada Stray Dog Safety | కుక్కల బారి నుంచి చిన్నారుల భద్రతకు ప్రత్యేకచర్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *