Paddy Procurement Protest | రోడ్డెక్కిన అన్నదాతలు.. వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి/ఆర్మూర్​: Paddy Procurement Protest | ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అనుకున్నంత స్థాయిలో కొనుగోళ్లు (grain purchase delay) జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల (paddy procurement) వద్ద నిరీక్షిస్తున్నారు. ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలని అధికారులను కోరుతున్నారు.

Paddy Procurement Protest | కామారెడ్డి మండలం తిమ్మాపూర్​లో..

తాజాగా కోతలు కోసి నెలరోజులు గడుస్తున్నా కొనుగోలు చేపట్టడం లేదని ఆగ్రహించిన అన్నదాతలు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన కామారెడ్డి (kamareddy) మండలం తిమ్మక్​పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఐకేపీ సిబ్బంది గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. దాంతో నెల రోజులుగా ఎదురు చూస్తున్నా పట్టించుకోకపోవడంపై రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రైతులు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము ఎండలో సతమతం అవుతుంటే అధికారులు పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాంటాలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం వద్దకు డీఆర్డీఏ పీడీ సురేందర్ చేరుకుని రైతులతో మాట్లాడారు. రెండు రోజులలో కాంటాలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

Paddy Procurement Protest | ఆర్మూర్​లో రైతుల ఆందోళన

ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్​ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ (Armoor Municipality) పరిధిలోని పెర్కిట్ (perkit) రహదారిపై శనివారం రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. 20 రోజులుగా రోడ్లపై ఎండపోసిన ధాన్యం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తుందన్నారు. తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, క్వింటాలు ధాన్యానికి 15 కిలోల కడ్తా తీస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. తక్షణమే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు నాయకులు నచ్చు చిన్నారెడ్డి, అల్లూరు గంగారెడ్డి, పాలెపు రాజు, రవి రెడ్డి, మోహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

team

ఆర్మూర్​లోని పెర్కిట్​ వద్ద రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు

ఇది కూడా చదవండి: Balakonda suicide attempt | ప్రియుడు మోసం చేశాడని మనస్తాపం.. పోలీస్​ స్టేషన్​ పైనుంచి దూకిన యువతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *