Telangana Nominated Posts | తెలంగాణలో నామినేటెడ్​ పదవుల భర్తీ..

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Nominated Posts | తెలంగాణ (Telangana)లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఎన్నాళ్లుగానో ఆశావహులు ఎదురుచూస్తున్న పదవులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) మోక్షం కల్పించింది. వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, సభ్యులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వుల సీఎస్‌ రామకృష్ణారావు జారీ చేశారు.

Telangana Nominated Posts | ఛైర్మన్లు వీరే..

బస్వరాజు శ్రీనివాస్‌ను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఛైర్మన్‌గా నియమించారు. దాసరిరాజు అజయ్‌ కుమార్‌ వాషర్‌మెన్‌ కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. మోతుకూరి చంద్రశేఖర్‌ గౌడ్‌ గీతకార్మికుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌, దొంగారి వెంకటేశ్వర్లు, పెరిక సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్, సంగా వెంకటరాజం మేర సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌, గట్టు తిమ్మప్ప వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించారు.

అలాగే బొమ్మ శ్రీరామ్‌ మున్నూరు కాపు సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఎం.రఘునాథ్‌ యాదవ్‌ యాదవ సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌, గుంజ రేణుక నారాయణ వడ్డెర సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌, దూదెం వెంకటరమణ చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌, బండి రమేష్‌ కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, గూడురు శ్రీనివాస్‌ పద్మశాలి సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్​ నియమించారు. భట్టరాజ కో–ఆపరేటివ్‌ సొసైటీ ఫెడరేషన్‌ ఛైర్మన్​గా సీహెచ్‌ బాలరాజు నియమితులయ్యారు. జువ్వాది నర్సింగ్‌రావు వెలమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, కొల్లె సరిత గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్‌ ఛైర్మన్‌, చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌ లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ ఛైర్మన్‌, ప్రొఫెసర్​ వెంకటనారాయణ తెలంగాణ తెలుగు అకాడమీ ఛైర్మన్‌,

Telangana Nominated Posts | పంచాయతీ ట్రైబ్యునల్‌ నియామకం

తెలంగాణ తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్‌ను నియమించింది. ఒక ఛైర్మన్​తో ఇద్దరు సభ్యులను నియమిస్తూ సీఎస్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఛైర్మన్‌గా సూదిని రామిరెడ్డితో పాటు నగులూరి కృష్ణకుమార్‌, బూసా వేణుగోపాల్‌ను సభ్యులుగా నియమించారు. వీరు రెండేళ్లపాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు.

ఇది కూడా చదవండి..: Education Fee Regulation| విద్య వ్యాపారం కావొద్దు.. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిందే: కవిత

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *