అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ponnam Prabhakar Visit | రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) బుధవారం జిల్లాకు విచ్చేశారు. ఇటీవల వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్(Gadugu Gangadhar) ఇల్లు షార్ట్ సర్క్యూట్‌కు దగ్ధం కాగా మంత్రి గడుగు ఇంటికి వెళ్లారు.
Ponnam Prabhakar Visit | ఘటనపై వాకబు..
ఈ సందర్భంగా ఇల్లు దగ్ధం కావడానికి కారణాలను పొన్నం ప్రభాకర్ తెలుసుకున్నారు. ఇంట్లోని పైఅంతస్తు పూర్తిగా కాలిపోవడాన్ని పరిశీలించారు. ధైర్యంగా ఉండాలని గడుగుకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశవేణు, కల్లుగీత కార్పొరేషన్ ఛైర్మన్ శేఖర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు( Congress Leaders) జావిద్ అక్రమ్, బంటు బలరాం, విపుల్ గౌడ్, మాజీ కార్పొరేటర్ గడుగు రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : ఇండిగో బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే విమాన ప్రయాణం..!