అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police Training | కేసుల దర్యాప్తులో నాణ్యత, కచ్చితత్వం పాటించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం పలు పోలీస్స్టేషన్లు, సీఐ, డీఎస్పీ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న రైటర్లకు కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Kamareddy Police Training | నేర్చుకున్న అంశాలపై అవగాహన..
ఈ సందర్భంగా రైటర్లతో స్వయంగా మాట్లాడి శిక్షణలో నేర్చుకున్న అంశాలు, కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియలపై వారికి కలిగిన అవగాహనను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. నేర్చుకున్న విషయాలను విధి నిర్వహణలో ఆచరణలో పెట్టాలని సూచించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి చార్జిషీట్ దాఖలు చేసే వరకు కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమగ్రంగా, స్పష్టంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. సాక్షులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను వాస్తవాల ఆధారంగా నమోదు చేయాలని, సాక్ష్యాధారాల సేకరణ, భద్రపరచడం, కేసు వివరాల నమోదులో ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఆధునిక పోలీసింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, విధి నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించి పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంపొందించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, ఇతర పోలీసు అధికారులు, జిల్లాలోని పోలీస్ స్టేషన్లు, సీఐ, డీఎస్పీ కార్యాలయాల రైటర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Power Cuts | ఆగమైతున్న అన్నదాత.. కరెంట్ లేక కళ్లెదుటే ఎండిపోతున్న పంటలు..