Kaleshwaram Water Release | గోదావరి జలాలు వృథా అవుతున్నా రైతుల గోస పట్టదా : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

రాష్ట్రంలో రైతుల గోస కాంగ్రెస్​ ప్రభుత్వానికి పట్టట్లేదని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

​అక్షరటుడే, భీమ్​గల్: Kaleshwaram Water Release | రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో రైతాంగం ఆందోళన చెందుతుంటే, లక్ష క్యూసెక్కుల కాళేశ్వరం జలాలు సముద్రం పాలవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Mla Prashanth reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మోర్తాడ్‌లో(morthad) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Kaleshwaram Water Release |  రైతుల పొట్ట కొట్టొద్దు

రాజకీయ కక్షలతో రైతుల పొట్ట కొట్టవద్దని ప్రశాంత్​రెడ్డి కోరారు. ఎగువన వర్షాలు లేకున్నా, ప్రాణహిత నది ద్వారా రోజుకు 10 టీఎంసీల నీరు మేడిగడ్డ వద్దకు చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజీతో(Medigadda Barrage) సంబంధం లేకుండానే ఆ నీటిని ఎత్తిపోసే ఇంజినీరింగ్ వ్యవస్థ అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. కేసీఆర్‌పై కోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చారని, ఎల్​అండ్​టీ సంస్థ ఉచితంగా మరమ్మతులు చేస్తామన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించలేదని ఆయన ఆరోపించారు.

Kaleshwaram Water Release | నాలుగు నియోజకవర్గాల్లో..

​నిజామాబాద్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లోని 70 శాతం గ్రామాలకు కాళేశ్వరమే జీవనాడి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో నీరు అడుగంటిందని.. కాళేశ్వరం ద్వారా నీటిని లిఫ్ట్ చేసి, వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీని నింపితేనే రైతులకు భరోసా ఇచ్చినట్లవుతుందన్నారు. ​కాళేశ్వరంపై నిజాలు నిగ్గుతేల్చేందుకు వెళ్తున్న కేటీఆర్‌ను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని మండిపడ్డారు. రేవంత్​రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేసి మాట తప్పినందుకే వర్షాలు కురవటం లేదన్నారు.

​Kaleshwaram Water Release | 15 రోజుల్లో నీళ్లు నింపి చూపిస్తాం..

కాళేశ్వరం ప్రాజెక్ట్​ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు.. 3 బ్యారేజీలు, 21 పంప్ హౌస్‌లు, 1500 కి.మీ. కాలువలు ఇందులో భాగమని ఆయన పేర్కొన్నారు. మీకు చేతకాకపోతే కేసీఆర్‌కు అప్పజెప్పండి.. 15 రోజుల్లో నీళ్లు నింపి చూపిస్తామని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. వెంటనే కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి పంపుహౌస్‌లు, ప్యాకేజీ-21 మోటార్లను ఆన్ చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన తామే బటన్ నొక్కి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. ​ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నాగంపేట్ శేఖర్ రెడ్డి, కల్లెడ ఏలియా, బద్దం ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: మెట్రో ఫేజ్-II విస్తరణకు అనుమతివ్వాలని సీఎం లేఖ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *