అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sridhar Babu Counter | కేటీఆర్ కన్నెపల్లి పర్యటనపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పర్యటన కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేపట్టారన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌజ్ (Kannepalli Pump House)ను పరిశీలించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం పథకం (Kaleshwaram Project)లో భాగంగా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి పంప్‌హౌజ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. కేటీఆర్ లాగా బీఆర్‌ఎస్ నాయకుల్లాగా తాము ఇంజనీర్లు కాదన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏది చెప్తే అదే చేస్తామన్నారు.
Sridhar Babu Counter | పొంగులేటి ఫైర్
బీఆర్ఎస్ (BRS) నాయకుల కాసుల కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ గతి పట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదోడికి ఇండ్లు కట్టిస్తే మాకు ఏ కమీషన్ వస్తది, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితే కమీషన్లు వస్తాయని ఆలోచన చేసి ప్రాజెక్టు కట్టారన్నారు. అవీనీతి దాహానికి అది కూలిపోతే, దాన్ని రిపేరు చేయట్లేదు ప్రభుత్వం అని, కన్నెపల్లి పోయి బీఆర్ఎస్ నాయకులు కథలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిని కూడా చదవండి : Ayodhya Temple Theft | అయోధ్య ఆలయంలో చోరీపై ఉద్దవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు