అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajiv Swagruha Plots | రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు తెలిపారు. ఫ్యూచర్ సిటీకి, అవుటర్ రింగ్ రోడ్ (ORR) కు సమీపంలో రంగారెడ్డి (Rangareddy), మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలోని తొర్రూర్ (66 ప్లాట్లు), కుర్మల్‌గూడ (11), బహదూర్ పల్లి (8) ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (Rajiv Swagruha Corporation)కు చెందిన 85 ఓపెన్ ప్లాట్ల విక్రయానికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు.
పెద్ద అంబర్‌పేటలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బహిరంగ వేలంలో పాల్గొన్న బిడ్డర్లు చదరపు గజానికి నిర్దేశించిన దానికంటే అధిక మొత్తంతో ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ.83 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ గౌతం తెలిపారు.
Rajiv Swagruha Plots | తొర్రూర్‌లో గజానికి రూ.45.50 వేలు
తొర్రూల్ లే అవుట్ లో ప్లాట్‌ను కొనుగోలు చేయడానికి బిడ్డర్లు పోటీ పడ్డారు. గరిష్టంగా చదరపు గజం స్థలాన్ని రూ.45,500 వేలకు దక్కించుకున్నారు. ఓఆర్ఆర్, ఆదిభట్ల ఐటీ క్యారిడార్‌కు సమీపంలో ఉన్న తొర్రూర్‌లో 200 -700 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 66 ప్లాట్లకు (plots) చదరపు గజానికి కనీస ధర 25 వేల రూపాయలుగా నిర్దారించగా, సగటున రూ. 32,500 ధర పలికిందన్నారు.
Rajiv Swagruha Plots | కుర్మల్‌గూడలో..
ఎయిర్ పోర్టు (Airport), ఆర్సీఐకి దగ్గర్లో ఉన్న కుర్మల్గూడో 200 నుంచి 400 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు గజానికి కనీస ధర 20 వేల నిర్ణయించారు. గరిష్టంగా రూ.27,500 ధర పలికింది. బహదూర్‌పల్లి ప్రాంతంలో 200 నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు వేలం వేశారు. ఇక్కడ చదరపు గజం కనీస ధర రూ.27 వేలుగా నిర్ణయించగా, వేలం పాటలో గరిష్టంగా రూ.40,500 ధర పలికింది. వేలంలో సగటున ఈ భూములకు గజం రూ.33,800కు కొనుగోలు చేశారు.
దీనిని కూడా చదవండి : Warangal Police | రౌడీ షీటర్లను రోడ్లపై తిప్పిన పోలీసులు


