Fee Reimbursement Pending | పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​, ఫీజు రీయింబర్స్​మెంట్​ను వెంటనే విడుదల చేయాలి..

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Fee Reimbursement Pending | జిల్లాలో పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్ (Fee Reimbursement)​, స్కాలర్​షిప్​ బకాయిలు(Scholarship Pending) వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఇందూరు శాఖ(ABVP Protest) డిమాండ్​ చేసింది. ఈ మేరకు నగరంలో సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు.

Fee Reimbursement Pending | విద్యార్థులు తీవ్ర అవస్థలు..

ఈ సందర్భంగా ఏబీవీపీ కంఠేశ్వర్ జోనల్ ఇన్​ఛార్జి దుర్గాదాస్ మాట్లాడుతూ స్కాలర్​షిప్​, ఫీజు రీయింబర్స్​మెంట్​ ఆలస్యం కావడంతో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువు కొనసాగించడంలో అవస్థలు పడుతున్నారని.. కొన్ని సందర్భాల్లో ఫీజులు చెల్లించలేక విద్యార్థులు కళాశాలలకు హాజరు కాలేకపోతున్నారన్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమన్నారు. విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు అని, ఆ హక్కును రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

Fee Reimbursement Pending | ప్రభుత్వం స్పందించాలి..

కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​లు, ఫీజు రీయింబర్స్​మెంట్​ను విడుదల చేయడంతో పాటు విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలుచేడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మనోజ్, ప్రేమ్, మున్నా, అఖిలేష్, కార్తీక్, సన్నీ, కిట్టు, రాజేష్, మణిదీప్, చక్రదీప్, అరుణ్, వినోద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy Govt | కాంగ్రెస్ ప్రభుత్వ ఆయుష్షు సగం అయిపోయింది: జీవన్ రెడ్డి

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *