జాతీయంTVK Vijay | విజయ్‌కి సీఎం కుర్చీ దక్కినా.. ముందున్నది ముళ్లబాటేనా?

TVK Vijay | విజయ్‌కి సీఎం కుర్చీ దక్కినా.. ముందున్నది ముళ్లబాటేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్​: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ (TVK Vijay) ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠానికి చేరువయ్యారు. అయితే అత్యల్ప మెజారిటీ, మిత్రపక్షాల ఒత్తిడి, అనుభవ లేమి, బలమైన ప్రతిపక్షాల సవాళ్ల మధ్య ఆయన ప్రభుత్వం ఎంతకాలం నిలబడుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

TVK Vijay | పార్టీ స్థాపించిన కొన్నిరోజులకే..

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపిన విజయ్ (TVK Vijay), తన పార్టీ తమిళగ వెట్రి కళగం ద్వారా కోట్లాది మంది అభిమానుల ఆశలను మోస్తూ అధికారానికి చేరువయ్యారు. పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే భారీ రాజకీయ ప్రభావం చూపిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే ఈ విజయ ప్రయాణం అంత సులభం కాదనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా ద్రవిడ మున్నేట్ర కళగం, అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం వంటి దిగ్గజ పార్టీల ఆధిపత్యం కొనసాగిన తమిళనాడు రాజకీయాల్లో.. విజయ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన సమీకరణాల మధ్య అధికార బాధ్యతలు చేపట్టబోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

TVK Vijay | సంఖ్యాబలం.. ప్రతి క్షణం పరీక్షే..!

విజయ్ ప్రభుత్వానికి ఉన్న ప్రధాన సవాలు సంఖ్యాబలం. మ్యాజిక్ ఫిగర్‌ను అతి కష్టం మీద అందుకున్న ఈ కూటమి ప్రభుత్వం, ఒకటి లేదా రెండు స్థానాల మెజారిటీతోనే నిలబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రతి ఓటు కీలకంగా మారనుంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ప్రభుత్వానికి ప్రాణవాయువులాంటిదే. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినా, లేదా రాజీనామా చేసినా ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థులు, చిన్నపాటి పార్టీలు కూడా “కింగ్ మేకర్” పాత్రలోకి రావచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌, వామపక్షాలు, వీసీకే వంటి పార్టీలు గతంలో నుంచే డీఎంకే కూటమిలో కీలక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి మద్దతు వెనుక కూడా రాజకీయ వ్యూహాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.

దీంతో విజయ్ ప్రభుత్వం ప్రతి నిర్ణయంలోనూ మిత్రపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. తన సొంత రాజకీయ ఎజెండాను అమలు చేయాలనుకున్నప్పుడు, కూటమి భాగస్వాముల నుంచి వ్యతిరేకత వస్తే అది విజయ్‌కు పెద్ద సవాలుగా మారవచ్చు. సినిమాల్లో హీరోగా కోట్లాది అభిమానులను అలరించిన విజయ్‌కు ప్రజాదరణ అపారంగా ఉన్నా, పరిపాలనా అనుభవం మాత్రం పెద్దగా లేదు. రాజకీయాల్లో గెలవడం ఒక ఎత్తయితే, ప్రభుత్వాన్ని స్థిరంగా నడపడం మరో పెద్ద పరీక్షగా మారనుంది. సంకీర్ణ ప్రభుత్వంలో శాఖల కేటాయింపులు, నిధుల పంపిణీ, అధికార యంత్రాంగంపై పట్టు వంటి అంశాల్లో మిత్రపక్షాల ఒత్తిడి తప్పదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా సీనియర్ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం విజయ్‌కు అగ్నిపరీక్షగా మారవచ్చు.

ఇప్పటివరకు ప్రజల్లో “స్టార్ హీరో”గా గుర్తింపు పొందిన విజయ్, ఇకపై తనను తాను “పరిపక్వ రాజకీయ నాయకుడు”గా నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ, ప్రతిపక్షాల వ్యూహాలను ఎదుర్కొంటూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఆయనకు అత్యంత కీలకంగా మారింది. రాజకీయాల్లో గెలవడం మాత్రమే కాదు.. గెలిచిన అధికారాన్ని నిలబెట్టుకోవడం కూడా ఇప్పుడు విజయ్ ముందు నిలిచిన పెద్ద సవాల్​గా చెప్పవచ్చు. ఈ రాజకీయ చదరంగంలో ఆయన నిజమైన “రాజు”గా నిలుస్తారా? లేక కేవలం ఒక “పావు”గానే మిగిలిపోతారా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

ఇది కూడా చదవండి..: Vijay Thalapathy Prediction | విజయ్ దళపతిపై వేణుస్వామి సంచలన జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bhayandar Vasai Bridge | డబుల్ డెక్కర్ వంతెన నిర్మాణానికి ముందడుగు.. 39 నుంచి 5 కి.మీ.లకు తగ్గనున్న దూరం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhayandar Vasai Bridge | మహారాష్ట్ర (Maharashtra)లోని...

Dhurandhar 2 Collections | బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతున్న ‘ధురంధర్ 2’ దూకుడు.. 50 రోజుల్లో ఏకంగా రూ.1,791 కోట్ల వసూళ్లు!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dhurandhar 2 Collections | బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్...

Migrant Worker Verification | ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో జాగ్రత్త: సీపీ

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Migrant Worker Verification | ఉపాధి కోసం...

Vijay Tamil Nadu|మేజిక్ ఫిగర్ దాటేసిన టీవీకే.. సీఎం పీఠం దిశగా దళపతి!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Vijay Tamil Nadu|తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం...