Kukatpally Degree College | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్రమ ఫీజుల వసూళ్లపై ఏబీవీపీ ఆందోళన

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kukatpally Degree College | హైదరాబాద్​ కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థుల ప్రవేశాల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కూకట్‌పల్లి జిల్లా శాఖ ఆందోళన చేపట్టింది. విద్యార్థుల నుంచి కళాశాల సిబ్బంది అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తూ, వాటిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది.

Kukatpally Degree College | అదనపు ఆర్థిక భారం మోపొద్దు..

ఈ మేరకు ఏబీవీపీ నాయకులు కళాశాలకు చేరుకుని, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ సిబ్బందిని నిలదీశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకే పరిమితమై అడ్మిషన్లు నిర్వహించాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపవద్దని కోరారు.

Telangana Telugu History | ఆంధ్రుల భాష ‘ఆంధ్రం’… మనది ‘జాన తెలుగు’!: “ఇడుపు కాయితం” Title లొల్లి వేళ ఆకట్టుకుంటున్న ప్రొఫెసర్ దంటు కనకదుర్గ విశ్లేషణ

Kukatpally Degree College | అధికారికంగా నిర్ణయించిన ఫీజులే తీసుకోవాలి

ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారదర్శకంగా ప్రవేశ ప్రక్రియ నిర్వహించాలని, అధికారికంగా నిర్ణయించిన ఫీజులు తప్ప మరే పేరుతోనూ వసూళ్లు చేయకూడదని ఏబీవీపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఒకవేళ అక్రమ ఫీజుల వసూళ్లు కొనసాగితే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

అయితే, ఏబీవీపీ చేసిన ఆరోపణలపై కళాశాల యాజమాన్యం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు నిజమైతే సంబంధిత అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *