Hyderabad Rape Case | కట్టుకున్నవాడే నరకం చూపించాడు.. హైదరాబాద్‌లో బయటపడ్డ షాకింగ్ క్రైమ్

హైదరాబాద్ నగరంలో నమ్మలేని దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  Hyderabad Rape Case | హైదరాబాద్ నగరంలో నమ్మలేని దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మయన్మార్‌కు చెందిన 18 ఏళ్ల వివాహితను ఆమె భర్తే ఇంట్లో బంధించి, తన ముగ్గురు స్నేహితులతో వరుసగా అత్యాచారానికి ఒడిగట్టించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటి యజమాని అద్దె కోసం వచ్చి తాళం పగులగొట్టడంతో ఈ అకృత్యం బయటపడింది.

Hyderabad Rape Case | ప్రేమ, పెళ్లి పేరిట ..

బాధితురాలు హుమైరా తమన్నా ఫిర్యాదు ప్రకారం… బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లో నివసిస్తున్న సమయంలో ఆమెకు మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గత మే నెలలో కుటుంబసభ్యులకు తెలియకుండా ఆమెను భారత్‌కు తీసుకువచ్చాడు. హైదరాబాద్ వచ్చాక కొద్ది రోజులకే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

Hyderabad Rape Case | ఇంట్లోనే బంధించి నరకం..

వివాహమైన నెల రోజుల తర్వాత ఫయాజ్ అసలు రూపాన్ని బయటపెట్టాడు. మయన్మార్‌కు చెందిన తన ముగ్గురు స్నేహితులు అహ్మద్ ముజీబ్, నూర్ కమల్, జియా-ఉర్-రెహమాన్‌లను అద్దె ఇంటికి తీసుకురావడం ప్రారంభించాడు. భర్త ఫయాజ్ బయటకు వెళ్తూ ఇంటికి బయటి నుంచి తాళం వేసి, తన స్నేహితులను లోపలికి పంపేవాడు. వారు ఆమెపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టేవారు. విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించడం, స్థానిక భాష తెలియకపోవడం , భయం కారణంగా బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయింది.

Hyderabad Rape Case | ఇంటి యజమాని రావడంతో ..

అక్టోబర్ 23న అద్దె డబ్బుల కోసం వచ్చిన ఇంటి యజమాని, బయట తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చి దాన్ని పగులగొట్టి తెరిచాడు. దీంతో ఈ అకృత్యం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాధితురాలు మరొకరి ఫోన్ సాయంతో బంగ్లాదేశ్‌లోని తన కుటుంబసభ్యులకు సమాచారం అందించగా, వారు నగరంలో ఉన్న బంధువులకు విషయం తెలిపారు.

బాధితురాలి బంధువు మహమ్మద్ రషీద్ సహకారంతో అక్టోబర్ 26న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులైన ఆ నలుగురిపై అత్యాచారం, అక్రమ బంధనం, క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

ఇది కూడా చదవండి:  Nizamabad BJP Protest | ఢిల్లీకి మూటలు మోసే ముఠామేస్త్రీ రేవంత్ రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *