అక్షరటుడే, రామారెడ్డి: Seethakka Development Works | ప్రజాసంక్షేమమే ద్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. మంగళవారం ఆమె రామారెడ్డి (ramareddy), సదాశివనగర్ మండలాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Seethakka Development Works | రామారెడ్డి మండలంలో..
రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు. హ్యామ్ ఫేజ్–1లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 71.63 కి.మీ రహదారుల అభివృద్ధి పనులకు రూ.42.80 కోట్లతో శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గిద్ద గ్రామ ప్రజల చిరకాల డిమాండ్ అయిన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.2.88 కోట్ల నిధులతో సబ్స్టేషన్ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఏకంగా 7 విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే మదన్మోహన్ చూపిన ప్రత్యేక చొరవ, పట్టుదల అభినందనీయమని కొనియాడారు.
Seethakka Development Works | నియోజకవర్గానికి పూర్తి సహకారం..
సీఎం, డిప్యూటీ సీఎం ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు సానుకూలంగా ఉన్నారని, జిల్లా ఇన్చార్జి మంత్రిగా తాను కూడా నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని సీతక్క హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ‘AH’ సినిమా విడుదల తేదీ ప్రకటన