Simple Energy Guntur | ఏపీలో సింపుల్ ఎనర్జీ సరికొత్త రీటైల్ హబ్.. ఒకే చోట అన్ని వసతులు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Simple Energy Guntur | ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ‘సింపుల్ ఎనర్జీ’ ఆంధ్రప్రదేశ్‌లో ( Andhra Pradesh ) తన వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేసింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ, గుంటూరు నగరంలో తమ మొట్టమొదటి అధునాతన రీటైల్ స్టోర్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించింది. ఈ స్టోర్ ద్వారా కంపెనీ తన సరికొత్త ‘రీటైల్ డిజైన్ 2.O’ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఇక్కడ పరిచయం చేయడం విశేషం.

Simple Energy Guntur | ఒకే చోట అన్ని..

ఆర్ఆర్ మొబిలిటీ (RR Mobility) భాగస్వామ్యంతో గుంటూరులో ఏర్పాటు చేసిన ఈ ‘సింపుల్ స్టోర్ 2.O’ సుమారు 1,170 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. వినియోగదారులకు ఒకే చోట సేల్స్, సర్వీస్, స్పేర్స్ అందించేలా దీనిని 3S ఫెసిలిటీగా తీర్చిదిద్దారు. దీనికి అదనంగా ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ కోసం 1,680 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి వసతులు కలిగిన అత్యాధునిక సర్వీస్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కస్టమర్లు బ్రాండ్‌తో సులభంగా కనెక్ట్ అవ్వడానికి ఇదొక కమ్యూనిటీ హబ్‌లా పనిచేస్తుందని సంస్థ తెలిపింది.
ultra.1

 

Simple Energy Guntur | మార్కెట్లోకి సరికొత్త ‘సింపుల్ ఆల్ట్రా’..

ఈ సరికొత్త స్టోర్‌లో కంపెనీకి చెందిన పలు రకాల ఈవీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా లాంచ్ చేసిన ‘సింపుల్ ఆల్ట్రా’ స్కూటర్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 6.5 kWh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే ఈ స్కూటర్, సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 400 కిలోమీటర్ల ఐడీసీ (IDC) రేంజ్ ఇస్తుంది. ఇది గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. కేవలం 2.77 సెకన్లలోనే 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. వీటితో పాటు 265 కి.మీ రేంజ్ ఇచ్చే ‘సింపుల్ వన్ జెన్ 2’,  190 కి.మీ రేంజ్ ఇచ్చే ‘సింపుల్ వన్‌ఎస్ జెన్ 2’ మోడళ్లు కూడా ఈ స్టోర్‌లో లభిస్తాయి.

Simple Energy Guntur | ఏపీ మాకు అత్యంత కీలకం …

గుంటూరు స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా సింపుల్ ఎనర్జీ ఫౌండర్, సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “భారతదేశవ్యాప్తంగా మా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే క్రమంలో గుంటూరు స్టోర్ ప్రారంభం ఒక ముఖ్యమైన మైలురాయి. ఆంధ్రప్రదేశ్ మాకు అత్యంత కీలకమైన మార్కెట్. ఇటీవల మాకు లభించిన నిధుల సహాయంతో రీటైల్ విస్తరణ, సర్వీస్ మౌలిక సదుపాయాలు , కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తున్నాము” అని పేర్కొన్నారు.
ultra.2

 

Simple Energy Guntur | ధరల వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి వచ్చిన సింపుల్ ఎనర్జీ స్కూటర్ల ధరల వివరాలను పరిశీలిస్తే.. ‘సింపుల్ వన్‌ఎస్ జెన్ 2’ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర INR 1,64,999 నుండి ప్రారంభమవుతుండగా, ‘సింపుల్ వన్ జెన్ 2’ మోడల్ ప్రారంభ ధర INR 1,94,000 గా ఉంది. అలాగే అత్యధిక రేంజ్ ఇచ్చే ప్రీమియం మోడల్ ‘సింపుల్ ఆల్ట్రా’ ఎక్స్-షోరూమ్ ధర INR 2,34,999 గా నిర్ణయించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38 నగరాల్లో 72 అవుట్‌లెట్లను నడుపుతున్న సింపుల్ ఎనర్జీ, రాబోయే నెలల్లో రాంచీ, భువనేశ్వర్ వంటి మరికొన్ని నగరాలకు విస్తరించనుంది. వాహనాల టెస్ట్ రైడ్‌లు , బుకింగ్‌ల కోసం కస్టమర్లు నేరుగా గుంటూరు స్టోర్‌ను సందర్శించవచ్చు లేదా సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి:  Monsoon Preparedness | వానాకాలం సీజన్​లో అధికారులు సమన్వయంతో పనిచేయాలి..: సీపీ సాయిచైతన్య

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *